ChatGPT చెప్పిందని పాటించాడు: చివరికి 60 ఏళ్ల వ్యక్తిని చూసి షాకైన డాక్టర్లు..

 ChatGPT చెప్పిందని పాటించాడు: చివరికి 60 ఏళ్ల వ్యక్తిని చూసి షాకైన డాక్టర్లు..

అమెరికాలోని న్యూయార్క్‌లో 60 ఏళ్ల వ్యక్తి ChatGPT ఇచ్చిన సలహా పాటించి చివరికి దాదాపు చనిపోయే పరిస్థితికి చేరాడు. ఉప్పు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని చదివిన అతను తినే ఆహారం నుండి ఉప్పు (సోడియం క్లోరైడ్)ను ఎలా తొలగించాలో ChatGPTలో అడిగాడు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ సలహాలు పాటిస్తూ అతను ఉప్పు వాడటం పూర్తిగా మానేసి, దానికి  బదులు సోడియం బ్రోమైడ్‌ వాడటం ప్రారంభించాడు.

 బ్రోమైడ్ విషంగా పనిచేస్తుంది:  సోడియం బ్రోమైడ్‌ను 1900 కాలంలో సాధారణంగా మందులలో ఉపయోగించేవారు, కానీ పెద్ద మొత్తం వాడకం అనేది విషంగా పనిచేస్తుంది. ఈ కేసు  గురించి అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ జర్నల్‌లో వచ్చింది. అందులో 60 ఏళ్ల వ్యక్తి ChatGPT సలహాతో గత మూడు నెలలుగా సోడియం బ్రోమైడ్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. చివరికి అతను అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాక,  తన ఇంటి పక్కన ఉండే వాళ్ళు తనకు విషం ఇచ్చారని చెప్పుకొచ్చాడు. 

►ALSO READ | ఇండియాతో పెట్టుకుంటే ఇట్లే ఉంటది మరీ.. రెండు నెలల్లోనే పాక్‎కు రూ.1,240 కోట్ల నష్టం

మొదట్లో అతని పరిస్థితి చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఏదైన సప్లిమెంట్లు లేదా మందుల వాడుతున్నారా అని అడిగితే ఎం తీసుకోవట్లేదని చెప్పాడు. అయితే ఆసుపత్రిలో చేరిన తర్వాత అతను తన ఆహారం, ఇంట్లో తయారు చేసిన నీటి గురించి చెప్పాడు, దింతో కేసు దర్యాప్తుకు దారితీసింది.

అతను ఆసుపత్రిలో ఉన్నప్పుడు అతనికి చర్మసంబంధమైన సమస్యలు, భ్రాంతులు వంటి తీవ్రమైన న్యూరోసైకియాట్రిక్ లక్షణాలు కనిపించాయి. ఈ కేసు రిపోర్టులో అతనికి తీవ్రమైన దాహం ఉన్నట్లు గుర్తించింది. అయినసరే అతను ఆసుపత్రిలో ఇచ్చే నీటిని తీసుకోలేదు. దింతో అతనికి ద్రవాలు, ఎలక్ట్రోలైట్లతో చికిత్స అందించాక చివరికి ఆసుపత్రి మానసిక విభాగానికి తరలించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్లోరైడ్‌ను బ్రోమైడ్‌తో భర్తీ చేయవచ్చని చాట్‌జిపిటిలో చదివిన తర్వాత అతనికి బ్రోమిజం(bromism) వచ్చిందని రిపోర్ట్ తేల్చింది.