Good Health: ఇవి మొలకెత్తిన తరువాత తినండి... ఆరోగ్య సమస్యలు దూరం..!

Good Health:  ఇవి మొలకెత్తిన తరువాత తినండి... ఆరోగ్య సమస్యలు దూరం..!

చిన్నవిగా ... పసుపు పచ్చ గింజలే కదా తీసిపారేయకండి.. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.      అవేనండి.. మన పోపుల పెట్టెలో ఉండే  మెంతి గింజలు.. వీటిని మొలకెత్తించి రోజూ గుప్పెడు తింటే చాలు చాలా రకాల వ్యాధులకు చెక్​ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  అందుకే మెంతులను రోజూ వంటల్లో ఉపయోగిస్తుంటాం.  ఔషధగని మెంతి గింజ వల్ల ఎన్ని లాభాలో ఇప్పుడు తెలుసుకుందాం. . 

మెంతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.ఇవి  ముఖ్యంగా ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్​ చేస్తాయి.  ఇంకా జీర్ణక్రియను ....కొలెస్ట్రాల్ స్థాయిలను  మెరుగుపరుస్తాయి. స్త్రీలలో పాల ఉత్పత్తిని పెంచడంలో.. పిరియడ్స్​ సమయంలో తిమ్మిరిని తగ్గించేందుకు  సహాయపడతాయి.    ఊబకాయాన్ని తగ్గించడానికి మెంతులు ఎంతో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

మెంతులను మొలకెత్తిన తరువాత రోజూ గుప్పెడు తింటే   అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి మెంతులు ఎంతో ఉపయోగకారిగా ఉంటాయి.  మొలకెత్తిన మెంతులు తినడం వలన కొలెస్ట్రాల్​ లెవల్స్​ తగ్గుతాయి.  వీటిలో ఉండే పొటాషియం బ్లడ్​ సర్క్యులేషన్​ ను మెరుగుపరుస్తుంది. మెంతుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు హైబీపీని కంట్రోల్​ చేస్తాయి. శరీరంలో అకస్మాత్తుగా వచ్చే వాపులు తగ్గడం ఇలా అనేక రకాల ఉపయోగాలున్నాయి. 

►ALSO READ | శ్రీ కృష్ణాష్టమి 2025: ఆగస్టు 15 లేదా 16 ... ఎప్పుడు జరుపుకోవాలి..

మనం తిన్న ఆహారం జీర్ణంకాక .. కడపు ఉబ్బరంగా ఉంటే.. మెంతులను నానబెట్టిన నీళ్లను తాగాలి.  అప్పుడు  జీర్ణాశయంలో ఎంజైమ్​లు ఉత్పత్తి అయి  త్వరగా జీర్ణమవుతుంది.     పోష‌కాల‌ను సైతం శ‌రీరం సుల‌భంగా  తీసుకుంటుంది. దీని వ‌ల్ల పోష‌కాహార లోపం త‌గ్గుతుంది.   

మొల‌కెత్తిన మెంతుల‌ను తిన‌డం వ‌ల్ల శరీరానికి  ఫైబ‌ర్ అధికంగా ల‌భిస్తుంది.ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది.  ఈ మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ...  విట‌మిన్ సి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది.  గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా  మెంతులు కాపాడుతాయి. ఇంకా  అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.