శ్రీ కృష్ణాష్టమి 2025: ఆగస్టు 15 లేదా 16 ... ఎప్పుడు జరుపుకోవాలి..

శ్రీ కృష్ణాష్టమి 2025:  ఆగస్టు 15 లేదా 16 ... ఎప్పుడు జరుపుకోవాలి..

ఈ ఏడాది ( 2025) శ్రీ కృష్ణజన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి.. ఆగష్టు 15  శుక్రవారమా - లేక ఆగష్టు 16 శనివారమా? అష్టమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఉంది  శ్రీ కృష్ణ జన్మాష్టమి   - ఎప్పుడు జరుపుకోవాలి!.. పండితులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ...

పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకునే నిర్ణయిస్తారు. ఏ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు...అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు. ఈ సారి కృష్ణాష్టమి విషయంలో ఆగష్టు 16 శనివారమే పండుగ అని పండితులు నిర్ణయించారు. అయితే ఆరోజు సూర్యోదయం తర్వాత అష్టమి తిథి వచ్చింది.

అష్టమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు

హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణాష్టమి తిథి ఆగస్టు 15 రాత్రి 11:49 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 16 రాత్రి 09:34 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది ఆగస్టు  16వ తేదీన కృష్ణ జన్మాష్టమిని జరుపుకోనున్నారు. 

సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు.  నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే ఆగష్టు 16 శుక్రవారం సూర్యోదయం సమయంలో  అష్టమి తిథి ఉండడంతో ఆ రోజే కృష్ణాష్టమి అని  పండితులు నిర్ణయించారు.  శ్రావణమాసంలో అమావాస్య ముందువచ్చే అష్టమి రోజు అర్థరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు..మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోధ దగ్గరకు చేరుకున్నాడు. 

►ALSO READ | జ్యోతిష్యం: పునర్వసు నక్షత్రంలోకి గురుడు.. మూడు రాశుల వారికి దశ తిరిగిపోద్ది..

పురాణాలు, మత గ్రంథాలు ప్రకారం, శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున వృషభ లగ్నంలో రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. ఈ పవిత్రమైన రోజున, దేవుడికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేస్తారు. భగవంతుని బాలరూపమైన లడ్డూ గోపాల్ కి స్నానం చేయించి, కొత్త బట్టలు ధరించి వెన్న, పంచామృతాలు, తులసి దళాలు సమర్పించాలి.