
‘ఊ.. అంటావా మామ.. ఊఊ అంటావా’అంటూ ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేసి ట్రెండ్ సెట్ చేసిన సమంత ఈసారి రామ్ చరణ్‌తో స్పెషల్ స్టెప్స్ వేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది.
చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న ‘పెద్ది’చిత్రంలో సమంత ఐటెం సాంగ్ చేయనుందట. ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే, శ్రీలీల సహా పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపించగా ఫైనల్‌గా సమంతను ఫిక్స్ చేశారనే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.
ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఓ ప్రత్యేక పాటను డిజైన్ చేశారట. దీనికోసం సమంతను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే ‘రంగస్థలం’ చిత్రంలో రామ్ చరణ్, సమంత జోడీ మెరవగా, ఈ క్రేజీ పెయిర్ మరోసారి రిపీట్ అవుతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
►ALSO READ | కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన నిర్మాణ సంస్థ.. ఒకేసారి ఆరు సినిమాల స్క్రిప్టులు లాక్
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మార్చి 27న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.