6 కిలో మీట‌ర్లు న‌డిచి.. మ‌న‌వరాలిని కిటికీలో నుంచి చూసెళ్తున్న‌ తాత‌

6 కిలో మీట‌ర్లు న‌డిచి.. మ‌న‌వరాలిని కిటికీలో నుంచి చూసెళ్తున్న‌ తాత‌

క‌రోనా మ‌హ‌మ్మారి ఈ తాత‌య్య ప్రేమ ముందు ఓడిపోయింది. కొద్ది రోజుల క్రిత‌మే పుట్టిన త‌న మ‌న‌వ‌రాలిని మ‌న‌సారా దీవించ‌కుండా అడ్డుకోలేక‌పోయింది. సోష‌ల్ డిస్టెన్స్ అనే అడ్డుగోడ‌ను పెట్ట‌గ‌లిగిందే కానీ.. ప్రేమ‌గా ఆ చిట్టిత‌ల్లిని చూసి గుండెల్లోంచి వ‌చ్చే చిరున‌వ్వుల‌కు ఏ గోడ‌లు పెట్టలేక‌పోయింది. క‌రోనాతో ఎక్క‌డిక‌క్క‌డ అంతా లాక్ డౌన్ అయిపోయినా ఓ వృద్ధుడు ఒంట‌రిగా రోజూ ఆరున్న‌ర కిలోమీట‌ర్ల దూరం న‌డిచి.. కిటికీలో నుంచి చూసి సంబ‌రంగా వెన‌క్కి వెళ్తున్నాడు. అమెరికాలోని మిషిగాన్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మా నాన్న‌ను చూస్తే చాలా బాధేస్తోంది

మిషిగాన్ లోని జీలాండ్ కు చెందిన‌ జోష్ గిల్లెట్ అనే యువ‌కుడికి ఇటీవ‌ల కూతురు పుట్టింది. అత‌డి భార్య‌కు డెలివ‌రీ అయిన త‌ర్వాత కొద్ది రోజుల‌కే క‌ర‌నా వైర‌స్ విజృంభించ‌డంతో ఎక్క‌డి వాళ్లు అక్క‌డే నిలిచిపోవాల్సి వ‌చ్చింది. జోష్ ఉంటున్న ప్రాంతానికి ఆరున్న‌ర కిలోమీట‌ర్ల దూరంలో అత‌డి తండ్రి ఉంటున్నాడు. అయితే ఆ ప‌సికందును లాక్ డౌన్ కు ముందు ఒకటి రెండు సార్లు ఎత్తుకుని లాలించిన జోష్ తండ్రి ఆ చిన్నారిని చూడ‌కుండా ఉండ‌లేక‌పోతున్నాడు. దీంతో ఆ చిట్టిత‌ల్లిని ఒక్క‌సారైనా అలా చూసి వెళ్లాల‌న్న త‌ప‌న‌తో లాక్ డౌన్ లోనూ ఆరున్నర కిలోమీట‌ర్ల దూరం కాలి న‌డ‌క‌న వ‌చ్చి వెళ్తున్నాడు. కిటికీ అద్దంలో నుంచి త‌న బిడ్డ‌ను చూసి వెళ్తున్న తండ్రిని చూస్తే చాలా బాధేస్తోంద‌ని, జీవితంలోనే ఇది తాను మ‌ర్చిపోలేని, అయితే ఇది టెంప‌ర‌రీ అని తన‌కు తెలిసినా బాధ ఆపుకోలేక‌పోతున్నానని అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోతో పోస్ట్ చేశాడు. ఇది రోజువారీగా జ‌రుగుతోంద‌ని, కానీ ఆయ‌న త‌న బిడ్డ‌ను ఎతుకోలేక‌పోవ‌డం త‌న హృద‌యాన్ని క‌ల‌చి వేస్తోంద‌ని అన్నాడు జోష్. అయితే త‌న తండ్రి ఫేస్ లో చెప్ప‌లేనంత ఆనందం చూస్తే ఆ బాధ‌పోతోంద‌ని చెప్పాడు.

View this post on Instagram

This is not normal. This is not fun. This is actually the worst feeling ever – but I know this is temporary. • • Today, my dad walked over 4 miles to our house so he could see Elliana through the window… again. This has become a regular thing. It breaks my heart that my dad can’t hold my daughter. However, as you can clearly see on my dad’s face, he’s overflowing with joy just to see her. He only got to hold her twice before #covid_19 locked us down. I hate that having a window between us is the only way she can see her grandpa – but again, I remember this is temporary. • • While my wife was pregnant, I don’t think an hour went by where my dad didn’t brag about becoming a grandpa soon. Now, his granddaughter is finally here and the only thing he can hold are the daily pictures we send him. However, he knows this is temporary. • • Even if you aren’t worried about catching it yourself: #stayhome for the new dads and moms who can’t wait to have the world meet their new baby. #stayhome for the grandparents who want to hold their new grandchild more than anything. #stayhome for the pregnant mom and nervous dad who are about to welcome home their newest family member. #stayhome for the greatgrandparents who know time is a gift. #stayhome for all the businesses who anxiously wait to open back up. #stayhome for the teachers and kids who are eager to get back to school. And especially, #stayhome for the doctors and nurses who are fighting this head on and would give anything to just #stayhome and hold their kids. • • If this grandpa can resist coming inside and loving his first grandchild, I know the rest of us can do this too. • • #girldad #thedad #stayhealthy #washyourhands

A post shared by Josh Gillett (@joshuagillett) on

మ‌నంద‌రికీ స్ఫూర్తి…

ఈ తాత‌య్య త‌న మ‌న‌వ‌రాలిపై ఎంత ప్రేమ ఉన్నా లోప‌లికి వ‌చ్చి ఎత్తుకోకుండా బ‌య‌ట ఆగిపోవ‌డాన్ని అంద‌రూ స్ఫూర్తి పొందాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జోష్ అన్నాడు. త‌న బిడ్డ‌ల మంచి కోసం తాను బ‌య‌టే ఆగిపోగ‌లిగిన‌ప్పుడు మ‌నంద‌రం కూడా ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఉండాల‌ని పిలుపునిచ్చాడు. మ‌నం ప్రేమించే వాళ్ల కోసం, డాక్ట‌ర్ల కోసం, టీచ‌ర్ల కోసం, పిల్ల‌ల కోసం అంద‌రం ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుదాం అంటూ త‌న పోస్ట్ ముగించాడు.

కంట‌త‌డి పెట్టిస్తోంది…

ఈ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు ఐదు వేల మంది ఈ ఫొటోను లైక్ చేశారు. బ్యూటిఫుల్ అంటూ కొంద‌రు కామెంట్ చేస్తే, బాగా చెప్పారు.. మీ చిన్నారి, అంద‌మైన ఫ్యామిలీకి ఆల్ ద బెస్ట్ అని మ‌రికొంద‌రు కామెంట్లు చేశారు. ఈ పొటో త‌న కంట‌త‌డి పెట్టించింద‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు.