ఈ మూడు జిల్లాల్లో గ్రానైట్ హబ్స్ పెట్టండి : మంత్రి శ్రీధర్ బాబు

ఈ మూడు జిల్లాల్లో గ్రానైట్ హబ్స్ పెట్టండి : మంత్రి శ్రీధర్ బాబు
  • మంత్రి శ్రీధర్ బాబుకు గ్రానైట్ అసోసియేషన్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ హబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబును గ్రానైట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. బుధవారం సెక్రటేరియెట్‌‌లో గ్రానైట్ పరిశ్రమల సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ 3 జిల్లాల్లో గ్రానైట్ హబ్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ రాయల నాగేశ్వరావు, నేతలు రమణ, యుగేంధర్, కోటేశ్వరావు పేర్కొన్నారు.

గ్రానైట్ పరిశ్రమకు పెట్టుబడి, కరెంట్ రాయితీ, పావల వడ్డీకి రుణాలు, స్టాంఫ్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలన్నారు. గ్రానైట్ ఎగుమతికి డ్రైపోర్టును స్థాపించాలని కోరారు. పర్యావరణ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు సాధారణ గ్రానైట్‌‌పై కూడా స్టేట్ జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు.