ఖమ్మం జిల్లాలో గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. వీఎం బంజర్ రింగ్ సెంటర్ లో గ్రానైట్ లారీ పై నుంచి మూడు పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు కిందపడిపోయాయి. ప్రమాద సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి కాకినాడ పోర్ట్ కు గ్రానైట్ రాళ్ళతో వెళ్తుండగా బంజర్ రింగ్ సెంటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి తొర్రూరు, మరిపెడ పట్టణాల మీదుగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిత్యం ఖమ్మం, చెన్నై, బెంగళూర్, ఇతర సుదూర ప్రాంతాలకు గ్రానైట్లోడ్స్ వెళ్తుంటాయి. అనుమతి పొందిన సామర్ధ్యం కంటే ఎక్కువ మొత్తంలో గ్రానైట్ షీట్లను లారీల్లో తరలించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
గ్రానైట్తరలింపులో అనేక అక్రమాలు..
గ్రానైట్షీట్లను ఒక లారీ పై 4 మెట్రిక్టన్నుల బరువు వరకు మాత్రమే తరలించవలసి ఉండగా, గ్రానైట్నిర్వాహకులు యథేచ్ఛగా 7 మెట్రిక్ టన్నులకు పైగా గ్రానైట్షీట్లను ఒకే సమయంలో తరలిస్తున్నారు. లారీ పై గ్రానైట్షీట్ లోడ్చేసిన క్రమంలో చుట్టూ ఇనుప గొలుసుతో రక్షణ కల్పించడం, షీట్కనపడకుండా టార్పాలిన్ ఏర్పాటు చేయడం, లారీ సైజ్దాటి రాకుండా షీట్లోపల ఉండేలా చూడటం, వాహనాలు అతివేగంగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, ఈ నిబంధనలను అతిక్రమిస్తున్నారు.
