గోడి ఇండియాలో గ్రాఫైట్​కు 31 శాతం వాటా

గోడి ఇండియాలో గ్రాఫైట్​కు 31 శాతం వాటా

హైదరాబాద్​, వెలుగు:   గ్రాఫైట్ ఎలక్ట్రోడ్‌‌‌‌‌‌‌‌లను  ఉత్పత్తి చేసే కోల్​కతా కంపెనీ గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్..  గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​లో రూ.50 కోట్ల విలువైన 31 శాతం వాటాను దక్కించుకుంది. ఈ డీల్​విలువ రూ.50 కోట్లని గ్రాఫైట్​ తెలిపింది.  ప్రస్తుతం వెంచర్ క్యాపిటల్ ఫండ్ అయిన బ్లూ అశ్వ క్యాపిటల్ మద్దతుతో నడుస్తున్న గోడి ఇండియాకు అడ్వాన్స్​డ్​ కెమిస్ట్రీ రీసెర్చ్​ అండ్​ డెవెలప్​మెంట్​లో స్పెషలైజేషన్​ ఉంది.  

ఎలక్ట్రిక్ వెహికల్స్​,  సూపర్ కెపాసిటర్ ఆధారిత ఎనర్జీ స్టోరేజ్‌‌ వ్యవస్థల కోసం స్థిరమైన బ్యాటరీల తయారీకి ఇది మద్దతు ఇస్తుంది.  భారతీయ,  ప్రపంచ మార్కెట్ల కోసం లిథియం అయాన్, సోడియం అయాన్  సాలిడ్- స్టేట్ బ్యాటరీల అభివృద్ధికి గోడి ఇండియా నాయకత్వం వహిస్తోందని కంపెనీ తెలిపింది.