మార్చి 31న హైదరాబాద్లో.. మాంసం దుకాణాలు బంద్

మార్చి 31న హైదరాబాద్లో.. మాంసం దుకాణాలు బంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మార్చి 31న మహవీర్ జయంతి సందర్భంగా మాంసం, బీఫ్ దుకాణాలు మూసివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీకర్ణన్​ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహావీర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కబేళాలతో పాటు అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎక్కడైనా మాంసం అమ్మకాలు జరిపితే జీహెచ్ఎంసీ చట్టం 533(బీ) ప్రకారం  చర్యలు తీసుకుంటామన్నారు.