నోయిడా వరకట్న హత్య కేసు..పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిపై కాల్పులు

నోయిడా వరకట్న హత్య కేసు..పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిపై కాల్పులు

ఢిల్లీ: గ్రేటర్ నోయిడా వరకట్న హత్య కేసులో బిగ్ ట్విస్ట్..నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతని కాలికి గాయాలయ్యాయి. 

ఆదివారం (ఆగస్టు24) మధ్యాహ్నం గ్రేటర్ నోయిడాలోని సిర్సా చౌక్ సమీపంలో నిందితులు విపిన్ తప్పించుకునే ప్రయత్నించాడు.. ఈ క్రమంలో పోలీసులు తుపాకీ లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో పోలీసులు తమను తాము రక్షించుకోవడానికి నిందితుడిపై కాల్పులు జరిపినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. 

విపిన్‌పై తన భార్యను వరకట్నం కోసం హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు విపిన్‌ను పట్టుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.