
- మైహోం భుజాలో కార్యక్రమం
గచ్చిబౌలి, వెలుగు: ఈ ఏడాది దేశవ్యాప్తంగా15 వేల పైచిలుకు గ్రీన్ విత్తన గణేశ్విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు రీసస్టనైబిలిటీ సంస్థ ప్రకటించింది. బంకమట్టితో తయారు చేసిన వినాయక విగ్రహంలో సేంద్రియ ఎరువు, సీడ్ బాల్ ఉంటాయని, ఇంట్లోని పూల కుండీలో నిమజ్జనం చేయడం వల్ల కొత్త మొక్క పుట్టుకొస్తుందన్నారు. మంగళవారం నుంచి సెప్టెంబరు 2 వరకు రీసస్టైనబులిటీ, బిగ్ ఎఫ్ఎంల ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా ఈ విత్తన వినాయక విగ్రహాల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
మంగళవారం రాయదుర్గంలోని మైహోం భుజా ఆవరణలో గేటెడ్ కమ్యూనిటీ వాసులకు విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విగ్రహాల పంపిణీ రథాన్ని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, నటి మధుషాలిలి జెండా ఊపి ప్రారంభించారు. తర్వాత వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఆక్రి యాప్ ప్రారంభించారు. మైహోం భుజా అసోసియేషన్ అధ్యక్షుడు రాజు మధనపల్లి, ప్రధాన కార్యదర్శి విద్యారెడ్డి, రామక్రిష్ణ పాల్గొన్నారు.