ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌కు ఇక గ్రీన్‌‌‌‌ ప్లేట్లు

ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌కు ఇక గ్రీన్‌‌‌‌ ప్లేట్లు
  • రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ ఆఫీసులకు ఉత్తర్వులు
  • ఇప్పటి నుంచి రిజిస్టరయ్యే వాహనాలకే
  • ‘ట్రాన్స్‌‌‌‌పోర్టు’కు యెల్లో, మిగతా వాటికి వైట్‌‌‌‌ లెటర్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గ్రీన్‌‌‌‌ నంబర్‌‌‌‌ ప్లేట్లు వచ్చేస్తున్నాయ్‌‌‌‌. ఇక రాష్ట్రంలోని ఎలక్ట్రిక్‌‌‌‌ వాహనాలు ఆకుపచ్చ రంగు ప్లేట్లతో కనబడనున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్‌‌‌‌కు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ ఆఫీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి నుంచి రిజిస్టరయ్యే వాహనాలకే గ్రీన్‌‌‌‌ నంబర్‌‌‌‌ ప్లేట్ల అనుమతి ఇవ్వనున్నారు. పాత వాటికి మార్పుండదు. ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌ వాహనాలకు నంబర్‌‌‌‌ ప్లేటు ఆకుపచ్చ రంగులో అక్షరాలు తెలుపు రంగులో ఉంటాయి. నాన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌కు గ్రీన్‌‌‌‌ బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో పసుపు అక్షరాలుంటాయి. ప్రస్తుతం డీజిల్‌‌‌‌, పెట్రోల్‌‌‌‌ వాహనాలకు వైట్‌‌‌‌, యెల్లో ప్లేట్లు వాడుతున్నారు. ట్రాన్స్‌‌‌‌పోర్టు వాహనమైతే యెల్లో బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో నలుపు రంగు అక్షరాలుంటాయి. నాన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వెహికల్‌‌‌‌కు తెలుపు బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో నలుపు రంగు అక్షరాలుంటాయి.

గ్రీన్‌‌‌‌ ప్లేట్లతో ఏం ప్రయోజనాలు?

పార్కింగ్‌‌‌‌ ప్రదేశాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. టోల్‌‌‌‌ ప్లాజాల్లో రాయితీలుంటాయి. పర్మిట్ల నుంచి మినహాయింపు, రద్దీ ప్రాంతాల్లో ప్రవేశం లాంటి ప్రయోజనాలు ఉంటాయి.