Donald Trump: ఇదేం సరదా.. పోప్ అవతారంలో ట్రంప్.. షాకైన నెటిజన్లు..!

Donald Trump: ఇదేం సరదా.. పోప్ అవతారంలో ట్రంప్.. షాకైన నెటిజన్లు..!

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫాం Truthలో పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఇటీవలే కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ గెటప్లో ట్రంప్ కనిపించిన ఫొటో అది. ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఫొటోపై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుంటే, మరికొందరు ట్రంప్ వైఖరిపై మండిపడుతున్నారు.

ఇలా పోప్ వేషధారణలో ఫొటో షేర్ చేయడం పోప్ ఫ్రాన్సిస్ను అగౌరవపరచడమేనని.. ట్రంప్ పైత్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోతుందని పోప్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ఇలాంటి గెటప్లో ఏఐ ఫొటోను జనరేట్ చేసి షేర్ చేసి చర్చ్ను, జీసస్ను కించపరిచారని మండిపడ్డారు.

Also Read : రెండు నెలలకు సరిపడా ఆహారం రెడీ చేసుకోండి

క్యాథలిక్ చర్చ్కు కొత్త పోప్ను ఎన్నుకునే కాంక్లేవ్ గురించి ప్రస్తావన వచ్చిన సందర్భంలో ట్రంప్ను మీడియా ప్రతినిధులు తదుపరి పోప్గా ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉందని అడిగారు. ‘‘నేను పోప్ అయితే బాగుండు.. అదే నా నంబర్ వన్ ఛాయిస్’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెట్టింట సెటైర్లు పేలాయి. ‘Pope Trump’ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. తాజాగా.. పోప్ అవతారంలో ట్రంప్ ఫొటో షేర్ చేయడంతో మరోసారి ట్రంప్ తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.