India vs pakistan: యుద్దానికి సిద్దమైందా..లోకల్స్కు ట్రైనింగ్ ఇస్తున్న పాకిస్తాన్ ఆర్మీ

India vs pakistan: యుద్దానికి సిద్దమైందా..లోకల్స్కు ట్రైనింగ్ ఇస్తున్న పాకిస్తాన్ ఆర్మీ

26 అమాయకులను బలిగొన్న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్  మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు భారత్ గట్టి చర్యలు చేపట్టంది. ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా రెచ్చిపోయి కయ్యానికి కాలు దువ్వుతుంది. ఇప్పటికే మిస్సైల్ పరీక్షలు చేసిన పాక్.. తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) వెంబడి స్థానికులకు పాకిస్తాన్ ఆర్మీ శిక్షణ ఇస్తున్న వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read : యుద్ధానికి రెడీ అయిన పాకిస్తాన్

లోకల్స్ ను యుద్దంలో పోరాటానికి సిద్దం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.పాకిస్తాన్ సైన్యం శిక్షణ శిబిరాలను ఏర్పటు చేసింది.. దీంతోపాటు స్థానికులకు ఆయుధాల నిర్వహణపై శిక్షణనిస్తుంది. అయితే పాకిస్తాన్ దళాలు యుద్ధం చేసేందుకు ఇష్టపడటంలేదని, అనేక మంది పాక్ సైనికులు పాకిస్తాన్ నుంచి వైదొలుగుతున్నాని Xలో వీడియో షేర్ చేయడంలో బయటపడింది.