బ్యాంకు తాళాలు పోగొట్టిన సిబ్బంది.. రోడ్లపైనే కస్టమర్లు

బ్యాంకు తాళాలు పోగొట్టిన సిబ్బంది.. రోడ్లపైనే కస్టమర్లు

బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడింది. తాళాలు పోయాయని బ్యాంకు తెరవక పోవడంతో.. సోమవారం (నవంబర్ 10) కస్టమర్లు బ్యాంకు ముందు ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది. 

ఎప్పటి లాగే టైమింగ్స్ ప్రకారం.. బ్యాంకుకు వచ్చిన కస్టమర్లు.. బ్యాంకు తెరవక పోవడంతో అయోమయానికి గురయ్యారు. సెలవు ఉందా ఏంటి.. అనే గందరగోళానికి గురయ్యారు. తాళాలు పోయినట్లుగా చెప్పడంతో వినియోగదారులు ఆగ్రహానికి గురయ్యారు. సిబ్బంది తాళాలు పోటొట్టుకోవడమేంటని ప్రశ్నించారు. తమ సమయం వృధా చేస్తున్నారంటూ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రం వ్యక్తం చేశారు.