
నాని హీరోగా వచ్చిన ‘హిట్ 3’చిత్రం క్లైమాక్స్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు కార్తి. ఏసీపీ వీరప్పన్ పాత్రలో కనిపించిన కార్తి.. ‘హిట్’ఫ్రాంచైజీలో రాబోయే నాలుగు భాగంలో హీరోగా నటించడం దాదాపు కన్‌ఫర్మ్ అయినట్టే. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటి వరకూ నటించిన వాళ్లంతా టాలీవుడ్ హీరోలే.
హిట్ 1లో విశ్వక్సేన్, హిట్ 2లో అడవి శేష్, హిట్ 3లో నాని నటించారు. ఇపుడు కార్తి ఎంట్రీ విశేషం అని చెప్పుకోవాలి. హిట్ 4 కోసం ఓ మర్డర్ మిస్టరీ కూడా సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు శైలేష్ కొలను, హిట్ 3 చివర్లో కార్తీ ఇంట్రడక్షన్తో కన్ఫామ్ చేశాడు.
Also Read : షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చిన హీరోయిన్ నడుం గిల్లిన పోకిరి
మరోవైపు తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్‌లో నటిస్తున్నాడు కార్తి. ప్రస్తుతం ‘సర్దార్’సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఇది పూర్తవగానే ‘ఖైదీ 2’లో నటించబోతున్నాడు. తాజాగా ఈ విషయంపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రజినీకాంత్‌తో ‘కూలి’తీస్తున్న లోకేష్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఖైదీ 2’ అని స్పష్టం చేశాడు. ఈ ఏడాది సెకెండాఫ్‌లో ఈ సినిమా సెట్స్‌కు వెళ్లబోతోంది.
మరోవైపు కార్తి పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ‘ఖాకీ’చిత్రానికి కూడా సీక్వెల్ తెరకెక్కబోతోంది. దర్శకుడు వినోద్ ఈ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడిక ‘హిట్ 4’కూడా ఈ లిస్ట్‌లో చేరింది. మొత్తానికి వరుస సీక్వెల్ సినిమాలలో చేయబోతున్నాడు కార్తి.