Manju Warrier: షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చిన హీరోయిన్ నడుం గిల్లిన పోకిరి

Manju Warrier: షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చిన హీరోయిన్ నడుం గిల్లిన పోకిరి

మ‌ల‌యాళ బ్యూటీ మంజు వారియర్ నటిగానే కాదు.. ఓ మహిళగా కూడా ఎంతో స్ట్రాంగ్. ఎందరో ఆమెను ఆరాధిస్తారు. మరెందరికి మంజువారియర్ ఇన్‌స్పిరేషన్‌. మన తెలుగు ప్రేక్షకులకు మంజు వారియర్ అంటే,  ‘‘వా.. వా.. వారేవా.. వేటకత్తై వచ్చిండే.. వేటకు వచ్చిండే' రజినీతో స్టెప్పులేసిన బ్యూటీ అంటేనే ఈ మంజు వారియర్ టక్కున గుర్తొస్తుంది. అలాంటి మంజు వారియర్కి ఓ చేదు అనుభవం ఎదురైంది.

ఇటీవలే, మంజు వారియర్ బెంగళూర్లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్లింది. ఆమె వ‌స్తుంద‌ని తెలిసి జనం పెద్ద సంఖ్యలో మాల్ దగ్గరకు వచ్చారు. అయితే, కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత మంజు వారియ‌ర్ తిరిగి వెళ్లేందుకు త‌న కారు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఆ సమయంలో కొందరు ఆకతాయిలు సడెన్ గా తన నడుముని గిల్లారు. అంతేకాకుండా అసభ్యకరంగా తనపై చేతులు వేయడానికి ప్రయత్నించారు.

ఈ పోకిరిగాళ్ల చిల్లరి చేష్టలతో తను 'లో లోపల' వణికిపోతూనే, సున్నితంగా వారికి సెల్ఫీలు ఇచ్చి, అక్కడినుండి వెళ్ళిపోయింది. 'ఇది కదా తన ధైర్యం. జీవితంలో ఇటువంటి చెత్త పనులు చేసేవారికి చిరునవ్వే కదా సమాధానం అంటూ' నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. మరికొందరైతే, పోలీసులు వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే.. లేదంటే సమాజం ఇట్టే మారుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే, ఇలాంటి సంఘటనలు సమాజంలో సాధారణ మహిళల నుండి సెలబ్రెటీల వరకు ఎదురువుతూనే ఉన్నాయి. ఇటీవలే శ్రీలీల సైతం ఇటువంటి సంఘటనే ఎదుర్కొంది. కొందరు ఆకతాయిలు ఏకంగా తన చేయి పట్టుకుని గుంపులోకి లాక్కెళ్లిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను క్షేమంగా పక్కకి తీసుకొచ్చారు. అలాగే, హీరోయిన్ హానీ రోజ్ కి కూడా షాప్ ఓపెనింగ్ సమయంలో ఇటువంటి ఇబ్బందే ఎదుర్కొంది.

మంజు వారియ‌ర్ విష‌యానికి వ‌స్తే.. 

మంజు వారియర్ గ్లామర్ పాత్రల జోలికి వెళ్లరు. హోమ్లీ క్యారెక్టర్లే ఒప్పుకుంటారు. తన నటనతో వారేవా అనిపించుకుంటారు. మలయాళంలో ఆమెకి వచ్చిన స్టార్‌‌డమ్ మరే హీరోయిన్‌కీ రాలేదు. సౌత్‌ సినిమా ఇండస్ట్రీలోని లేడీ సూపర్ స్టార్స్తో  మోస్ట్ ఇన్ఫ్లెన్షియల్ ఎవరు అంటూ ఓ సంస్థ చేసిన సర్వేలో మంజు టాప్‌లో నిలిచారు. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉన్న ఏకైక మలయాళ నటి మంజు.

అయితే, తన వివాహ జీవిత చేదు అనుభవం త‌ర్వాత 2014 నుంచి మంజు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తొలి హిట్‌ మూవీ ‘సల్లాపమ్‌’ హీరో దిలీప్‌తో ప్రేమలో పడటం ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది. పర్సనల్‌ లైఫ్ డిస్టర్బ్ అయినా మంజు వారియర్ కుంగిపోలేదు. పదహారేళ్లకు తిరిగొచ్చి కెరీర్‌‌పై దృష్టి పెట్టింది. అలా 2024లో రజినీకాంత్ సరసం ‘వేట్టయాన్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో  ‘‘మెరుపై వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.." పాటకు మంజు వారియర్ వేసిన స్టెప్పులతో మరింత ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా ఎల్2 ఎంపురాన్ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.