ఐదు ప్రైవేటు వర్సిటీలకు గ్రీన్ సిగ్నల్

ఐదు ప్రైవేటు వర్సిటీలకు గ్రీన్ సిగ్నల్
  • గెజిట్ రిలీజ్ చేసిన సర్కార్  

హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు మరో ఐదు ప్రైవేటు వర్సిటీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నిక్ మార్ కన్ స్ర్టక్షన్ వర్సిటీ (శామీర్ పేట), ఎంఎన్​ఆర్ వర్సిటీ (ఫసల్ వాడీ, సంగారెడ్డి), గురునానక్ వర్సిటీ(ఇబ్రహీంపట్నం),  శ్రీనిధి వర్సిటీ(ఘట్ కేసర్), కావేరీ వర్సిటీ(గౌరారం, వరంగల్)కి అప్పటి గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ గత నెల మొదటి వారంలోనే ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ ను తాజాగా గవర్నమెంట్ లా సెక్రటరీ తిరుపతి రిలీజ్ చేశారు. ఈ విద్యాసం  వత్సరం నుంచి ఆయా వర్సిటీల్లో అడ్మిషన్లు చేసుకునేందుకు త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా జీవో రిలీజ్ చేయనున్నది.