IPL ఆడేందుకు కివీస్‌ ప్లేయర్ల‌కు గ్రీన్‌ సిగ్నల్

IPL ఆడేందుకు కివీస్‌ ప్లేయర్ల‌కు గ్రీన్‌ సిగ్నల్

ఎన్‌ఓసీ ఇస్తామన్న న్యూజిలాండ్ బోర్డు

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ క‌ప్ వాయిదా పడడంతో ఐపీఎల్ 2020 ఎడిషన్ కు లైన్ క్లియర్ కి అవగా.. యూఏఈ వేదికగా లీగ్ జరగడం దాదాపు ఖాయమైంది. అయితే, ఫారిన్ క్రికెటర్ల ప్రాతినిధ్యంపైనే ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్ జడ్సీ) తమ క్రికెటర్ల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐపీఎల్ ఆడేందుకు తమ క్రికెటర్ల‌కు ఎన్‌ఓసీ ఇస్తామని స్పష్టం చేసింది. అయితే ఆడతారా లేదా అనేది ప్లేయర్ల వ్యక్తిగత నిర్ణ‌యమని పేర్కొంది. ‘ఐపీఎల్లో ఆడేందుకు మా ప్లేయర్ల‌కు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇస్తాం. అయితే ఆడతారా లేదా అనేది వాళ్లే తేల్చుకోవాలి. కరోనా  ముప్పు ఉండడంతో ప్లేయర్లు తమ ఆరోగ్యం విషయంలో బాధ్యతగా ఉండక తప్పదు. ఇప్పటికే మేము వారికి అవసరమైన సమాచారం ఇస్తున్నాం. ఐపీఎల్ ఎక్కడ నిర్వహించాలనేది బీసీసీఐ నిర్ణ‌యం. ఆ అంశంలో మేము తలదూర్చం, ఎలాంటి కామెంట్ చెయ్యం’ అని ఎన్ జెడ్ సీ ప్రతినిధి రిచర్డ్ బూక్ పేర్కొన్నారు.

అంతేకాక ఆగస్టులో జరగాల్సిన ఇండియా, కివీస్ ‘ఎ’ జట్ల సిరీస్ రద్దయిందని రిచర్డ్ బూక్ కటించారు. ఇరు బోర్డులు కలిసి ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా, కివీస్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్ (సన్రైజర్స్), నీషమ్(పంజాబ్), లూకీ ఫెర్గూసన్ (నైట్రైడర్స్), మెక్లెన్ గ‌న్, ట్రెంట్ బోల్ట్(ముంబై), మిచెల్ శాట్నర్ (చెన్నై) ఐపీఎల్లో వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం