283 ట్రాన్స్‌‌లేటర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్న‌ల్

283 ట్రాన్స్‌‌లేటర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్న‌ల్

సెంట్రల్ గవర్నమెంట్ వివిధ శాఖల్లో 283 జూనియర్, సీనియర్ ట్రాన్స్‌‌లేటర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌‌ఎస్‌‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేయాలి. అప్లికేషన్ చివరితేది జులై 25. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అక్టోబర్‌‌‌‌ 6న పేపర్‌‌‌‌–1, జనవరి 31న పేపర్‌‌‌‌–2 ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మెరిట్ సాధించిన వారిని సెలెక్ట్ చేస్తారు.
పోస్టుల వివరాలు
జూనియర్ ట్రాన్స్‌‌లేటర్/
హిందీ ట్రాన్స్‌‌లేటర్ –275
సీనియర్ హిందీ ట్రాన్స్‌‌లేటర్ –8
ఎలిజిబులిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ, ఇంగ్లిష్‌‌ మీడియంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. హిందీ నుంచి ఇంగ్లీష్‌‌లోకి ఇంగ్లిష్ నుంచి హిందీలోకి ట్రాన్స్‌‌లేషన్ చేయగలగాలి. ఇందుకు సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా సర్టిఫికెట్‌‌ ఉండాలి. వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు మినహాయింపు ఉంటుంది)

ఎగ్జామ్ ప్యాటర్న్

ఎగ్జామ్ మొత్తం 300 మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌‌‌‌–1 మల్టిపుల్ చాయిస్ లో 100 మార్కులకు ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్‌‌డ్ ఎగ్జామ్. రెండు గంటల టైమ్ ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లిష్, జనరల్ హిందీ సబ్జెక్టులు ఉంటాయి. తప్పు ఆన్సర్‌‌‌‌కు 0.25 నెగెటివ్ మార్కు ఉంటుంది. పేపర్‌‌‌‌–2 డిస్క్రిప్టివ్‌‌ టైప్‌‌లో ఉంటుంది. ఇందులో హిందీ, ఇంగ్లీష్ వ్యాసాలు ఒక భాష నుంచి మరో భాషలోకి ట్రాన్స్‌‌లేషన్ చేయాలి. 2గంటల టైమ్ ఉంటుంది.

నోటిఫికేషన్‌‌

అప్లికేషన్ లాస్ట్‌‌ డేట్‌‌: జులై 25
ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు మినహాయింపు ఉంటుంది.
ఎగ్జామ్ షెడ్యూల్‌‌: పేపర్–1: అక్టోబర్ 6
పేపర్‌‌‌‌–2 2021, జనవరి 31
ఎగ్జామ్ సెంటర్లు: హైదరాబాద్, వైజాగ్‌‌
వెబ్‌‌సైట్: ssc.nic.in

మ‌రిన్ని వార్త‌ల కోసం