కోవిడ్ మ్యాప్ తో కిరాణ షాప్స్, సూపర్ మార్కెట్ల వివరాలు

కోవిడ్ మ్యాప్ తో కిరాణ షాప్స్, సూపర్ మార్కెట్ల వివరాలు

హైదరాబాద్‌‌, వెలుగు : లాక్ డౌన్ తో సూపర్ మార్కెట్లు, కిరాణా షాప్‌‌ల ఓపెన్‌‌కు గవర్నమెంట్ టైం లిమిట్ పెట్టింది. కొన్నిచోట్ల మధ్యాహ్నం వరకు, మరికొన్నిచోట్ల సాయంత్రం దాకా తెరిచి ఉంటున్నాయి. సరుకుల కోసం షాప్ వెళ్తే క్లోజ్అవడమో, కావాల్సిన వస్తువులు లేకపోవడమో, క్యూ ఎక్కువగా ఉండడమో ఎదురవుతోంది. ఇలాంటి ప్రాబ్లమ్స్​ను ఇంట్లో ఉండగానే తెలుసుకునేందుకు బెంగళూరుకు చెందిన స్విగ్గి ఎంప్లాయ్‌‌ ఫణి కిషన్, కెనడాలో ఉండే హైదరాబాద్​కు చెందిన తన ఫ్రెండ్ సంజీవ్ తో కలిసి కొవిడ్ మ్యాప్‌‌ క్రియేట్‌‌ చేశారు. ఇంటికి సమీపంలోని కిరాణ షాప్, సూపర్‌‌ మార్కెట్ల వివరాలతో మొబైల్‌‌లోనే ఈజీగా తెలుసుకునేలా రూపొందించారు. వాటి దగ్గరి పరిస్థితులను ఎప్పటికప్పుడు అప్డేట్​చేస్తున్నారు. గత నెలలో హైదరాబాద్​సహా 20 సిటీల్లో దీన్ని లాంచ్‌‌ చేశారు.

ఇలా వర్క్‌‌ చేస్తుంది

ఈ కొవిడ్ మ్యాప్‌‌ని గూగుల్, క్రోమ్‌‌లో www.covidmaps.in  టైప్ చేసి, ఓపెన్ అయిన తర్వాత మన లొకేషన్ షేర్ చేస్తే స్థానికంగా ఉండే కిరాణా స్టోర్స్ డీటెయిల్స్ వస్తాయి. మీ ఏరియాల్లో షాప్స్ టైమింగ్స్, మాస్క్ లు, శానిటైజర్స్ యూజ్ చేస్తున్నారా..? రష్ ఎలా ఉంది..? ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయా, లేదా అనే సమాచారం తెలుసుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె వంటి మెట్రోపాలిటన్‌‌ సిటీల్లో ఎక్కువగా ఈ మ్యాప్​ యూజ్‌‌ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అప్డేట్​ చేసేందుకు 20 మంది నాన్‌‌ ప్రాఫిట్‌‌ వలంటీర్లు పనిచేస్తున్నారు. యాప్​లో యాడ్​ అయిన కస్టమర్లు కూడా షాప్స్​, స్టోర్స్​ వద్ద పరిస్థితి పోస్ట్​ చేస్తున్నారు. తాము వెళ్లిన షాప్‌‌లో పరిస్థితి ఎలా ఉందో రివ్యూస్‌‌ రాస్తున్నారు.