ఓపెన్ కారులో వరుడి స్టంట్స్.. రూ.2 లక్షల ఫైన్

ఓపెన్ కారులో వరుడి  స్టంట్స్.. రూ.2 లక్షల ఫైన్

ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లో హైవేపై స్టంట్లు చేసిన వరుడికి, అతడి ఫ్రెండ్స్ కి భారీ షాకిచ్చారు పోలీసులు. వరుడి కారు సహా.. మరో ఎనిమిది కార్లకు 2 లక్షల జరిమానా విధించారు. ముజఫర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి తన పెళ్లి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. అయితే టాప్ లెస్ ఆడీ కారులోని వరుడు సహా.. మరికొన్ని కార్లలోని అతడి ఫ్రెండ్స్ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ డ్యాన్స్ లు చేస్తూ.. విన్యాసాలకు పాల్పడ్డారు. కొందరు కార్లపై కూర్చొని సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ డ్యాన్సులు చేస్తూ.. స్టంట్లు చేశారు. కొందరు కార్లపై కూర్చోని సెల్ఫీలు దిగగా.. మరికొందరు కార్లకు ఇరువైపులా ఉండే కిటికీలపై వేలాడుతూ స్టంట్స్ చేశారు. ముజాఫర్ నగర్- హరిద్వార్ హైవేపై జరిగిన ఊరేగింపు వీడియోలు వైరల్ గా మారాయి.