
హైదరాబాద్, వెలుగు : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో పెద్దల హస్తం ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. కిందిస్థాయి ఉద్యోగులను బలిచేసి పెద్దలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల పోరాటం వల్ల వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలను అమ్మకాలకు పెడుతున్నారని బుధవారం ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని ఉద్యోగ నియామకాలపైనా సిట్టింగ్జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.