
గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫైనల్ కీ విడుదలైంది. టీఎస్‌పీఎస్సీ వెబ్సైట్లో ఫైనల్ కీను అందుబాటులో ఉంచిన్లు టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ ని టీఎస్‌పీఎస్సీ అక్టోబరు 29న విడుదల చేసింది. ప్రాథమిక కీ అభ్యంతరాలపై సోమవారం టీఎస్పీఎస్సీ నిపుణుల కమిటీ భేటీ అయి చర్చించింది. అనంతరం మంగళవారం ఫైనల్ కీని విడుదల చేసింది. ఫైనల్ కీ కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. టీఎస్పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ఫైనల్ కీ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
ఈ ఏడాది అక్టోబర్ 16న గ్రూప్ -1 రాతపరీక్ష నిర్వహించింది. 503 పోస్టులకు 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక గ్రూప్-1 పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాలను టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసింది. అయితే 2,86,051 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాశారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీని విడుదల చేసింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించింది.