Good news: పెరగనున్న గ్రూప్ 2, 3 పోస్టులు !

Good news: పెరగనున్న గ్రూప్  2, 3 పోస్టులు !
  • వెకెన్సీ పోస్టుల వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు
  • రానున్న సంవత్సర కాలంలో రిటైర్ అయ్యేవారిని 
  • వెకెన్సీలో కలపాలని స్పష్టం

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు మరిన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ మేరకు కసరత్తును ప్రారంభించింది. డైరెక్ట్ రిక్రూట్​మెంట్​కు ప్రస్తుతం ఏయే శాఖలో ఎన్ని వెకెన్సీలు ఉన్నాయో వివరాలు పంపాలని అన్ని డిపార్ట్​మెంట్లకు ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. గురువారం సాయంత్రంలోగానే వివరాలు పంపా లని స్పష్టం చేసింది. రానున్న సంవత్సర కాలంలో రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల్లో గ్రూప్ 2,3ల్లో డైరెక్ట్ రిక్రూట్​మెంట్ వెకెన్సీ ఏర్పడితే ఆ వివరాలను కూడా అందజేయాలని తెలిపింది.

 గ్రూప్ 2, 3లలో ఏ పోస్టు ఖాళీ ఉన్నది? రానున్న సంవత్సర కాలంలో ఏర్పడే ఖాళీలు ఎన్ని అని వేర్వేరుగా లిస్ట్​లు పంపాలని స్పష్టం చేసింది. దీంతో గ్రూప్ 2,3 పోస్టులకు సంబంధించి మళ్లీ రీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం గ్రూప్ 2లో ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం 783 ఉద్యోగాలు ఉండగా ఆగస్ట్ 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. 2022లో విడుదల చేసిన గ్రూప్ 3లో 1,388 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. దీంతో గ్రూప్ 1కు అదనంగా కొత్త పోస్టులు కలిపినట్లుగానే.. గ్రూప్ 2,3 పోస్టులకు కూడా కలిపి ఎక్కువ మొత్తంలో రిక్రూట్​మెంట్ చేస్తారని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.