గ్రూప్ 2 రిజర్వేషన్ వేకెన్సీ డేటా రిలీజ్

గ్రూప్ 2 రిజర్వేషన్ వేకెన్సీ డేటా రిలీజ్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 ద్వారా భర్తీ చేసే పోస్టులకు సంబంధించిన డిటెయిల్డ్ రిజర్వేషన్ల డేటాను టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. 2022 డిసెంబర్ లో 783 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే, అప్పట్లో రిజర్వేషన్ల అంశంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఇటీవల హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలివ్వడంతో, దానికి అనుగుణంగా సర్కారు కొత్త రోస్టర్ ప్రకటించింది. దీని ప్రకారం డిపార్ట్ మెంట్ల పోస్టులకు సంబంధించిన వేకెన్సీ బ్రేకప్ రిలీజ్ చేసింది. ఆ వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో పెట్టింది. 

గ్రూప్ 4 స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్..

గ్రూప్ 4 స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 22 నుంచి మే 3 వరకు నిర్వహించనున్నట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. 1,569 మంది అభ్యర్థులకు డేట్ల వారిగా షెడ్యూల్​ను రిలీజ్ చేసింది.