గ్రూప్ 4కు 9,51,321 అప్లికేషన్లు

గ్రూప్ 4కు 9,51,321 అప్లికేషన్లు
  • ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ
  • ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు: గ్రూప్4 కు పోస్టులకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. డిసెంబర్ 30 నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 9,51,321 అప్లికేషన్లు వచ్చాయని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 8,180 పోస్టులు ఉండగా, ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ పడుతున్నారు. 

హాస్టల్ వార్డెన్ పోస్టులకు 1.45 లక్షలు

వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని వార్డెన్లు, మేట్రన్, సూపరింటెండెండ్ పోస్టులకు దరఖాస్తు గడువు కూడా శుక్రవారంతో ముగిసింది. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 2 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది. 581 పోస్టులకు 1,45,358 అప్లికేషన్లు అందాయి. ఒక్కో పోస్టుకు 250 మంది పోటీ పడుతున్నారు. ఈ పరీక్ష ఆగస్టులో ఉంటుందని టీఎస్​పీఎస్సీ తెలిపింది.