తెలంగాణలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్రంలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలైంది. 9,168 పోస్టులు గ్రూప్‌- 4 ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడించింది. ఈనెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ ఆడిటర్‌ అండ్‌ వార్డ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇటీవల 9,168 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే.