గ్రూప్ 4 ప్రిలిమినరీ కీ విడుదల చేసిన TSPSC

 గ్రూప్ 4 ప్రిలిమినరీ కీ విడుదల  చేసిన TSPSC

గ్రూప్ 4 ప్రిలిమినరీ కీని టీఎస్ పీఎస్సీ రిలీజ్ చేసింది.  2023 ఆగస్టు 30 నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 04 వరకు కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌ ద్వారా తెలపాలని వెల్లడించింది.   అలాగే పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్‌ షీట్ల డిజిటల్‌ కాపీలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సెప్టెంబర్‌ 27 వరకు అవి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. తెలంగాణలో జులై 1వ తేదీన TSPSC  గ్రూప్ 4 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. 

8 వేల180  గ్రూప్ 4  సర్వీసుల ఉద్యోగాల భర్తీకి మెుత్తం 9 వేల51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.  గ్రూప్ 4   పరీక్ష కోసం 2 వేల 878 ఎగ్జామ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశారు. గ్రూప్ పేపర్‌-1 జనరల్ స్టడీస్‌కు 7,62,872 మంది హాజరు కాగా.. పేపర్-2 సెక్టరేరియల్ ఎబిలిటీస్‌కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దాదాపు ఈ పరీక్షకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరయినట్లు అధికారులు తెలిపారు.