50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో గ్రూప్స్ కోచింగ్

50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో గ్రూప్స్ కోచింగ్

తెలంగాణ‌‌ రాష్ట్రంలోని 50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో సెప్టెంబరు 1 నుంచి టీఎస్‌‌పీఎస్సీ గ్రూప్‌‌-3, 4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పోటీపరీక్షలకు ప్రత్యక్ష శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీ అభ్యర్థుల నుంచి ఆన్‌‌లైన్‌‌ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: గ్రూప్‌‌-3, 4 శిక్షణ కోసం పది, ఇంటర్‌‌, డిగ్రీలో 60 శాతం మార్కులు, డీఎస్సీ, గురుకుల పోస్టులకు బీఈడీలో 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: విద్యార్హత పరీక్షలో వచ్చిన మార్కులు, సీట్ల లభ్యత ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు బీసీ స్టడీసర్కిల్‌‌ వెబ్‌‌సైట్‌‌ ద్వారా ఆగ‌‌స్టు 25లోగా ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. 27న ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. కోచింగ్​ సెప్టెంబర్ 1న ప్రారంభం అవుతుంది. వివరాల కోసం 040-–24071178 లేదా 040-–27077929 ఫోన్​ నంబర్స్​కు సంప్రదించాలి. 

వెబ్​సైట్​: www.studycircle.cgg.gov.in