సింఘూ బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత

సింఘూ బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత

ఢిల్లీ సింఘూ బోర్డర్ లో ఆందోళన చేస్తున్న రైతులు, స్థానికులుగా చెప్పుకున్న కొందరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఏర్పడింది. స్థానికులుగా చెప్పుకున్నవారు…  రైతుల ఆందోళనా స్థలానికి చేరుకుని వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సింఘు బోర్డర్ ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. వారితో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నించారు. స్థానికులమంటూ వచ్చినవారిలో కొందరు రైతులకు సంబంధించిన సామగ్రిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో రెండు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.

ఈ ఘర్షణల్లో అలీపూర్ SHO ప్రదీప్ పలివాల్ తీవ్రంగా గాయపడ్డారు.  ఓ వ్యక్తి తల్వార్ తో పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకున్నారు పోలీసులు. అక్కడ జరిగిన తోపులాటలో  SHO ప్రదీప్ పలివాల్ కు గాయాలు అయ్యాయి. తల్వార్ తో వచ్చిన వ్యక్తిని రైతుగా అనుమానిస్తున్నారు.

ఇక టిక్రీ బోర్డర్ లోనూ… ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. స్థానికులమని కొందరు జాతీయ జెండాలతో రైతులు ఆందోళన చేస్తున్న చోటకు వచ్చారు. టిక్రీ బోర్డర్ ఖాళీ చేయాలంటూ నినాదాలు చేశారు. అయితే అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా వారిని నియంత్రించారు పోలీసులు.

see more news

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి