చిన్నసిటీల్లో పెరుగుతున్న ఫుడ్‌‌ డెలివరీలు

చిన్నసిటీల్లో పెరుగుతున్న ఫుడ్‌‌ డెలివరీలు

బెంగళూరు: కరోనా వల్ల కార్మికులు నగరాల నుంచి వెనక్కి వెళ్లడం స్విగ్గీ వంటి ఫుడ్‌‌‌‌ డెలివరీ స్టార్టప్‌‌‌‌లకు మేలు చేస్తోంది. ఇది వరకటితో పోలిస్తే చిన్న  నగరాల్లో ఫుడ్‌‌‌‌ డెలివరీలు రెట్టింపు అయ్యాయని స్విగ్గీ, జొమాటో ప్రకటించాయి. కోల్‌‌‌‌కతా, కొచ్చి, లక్నో, వైజాగ్‌‌‌‌, గువాహటి, మైసూరు వంటి నగరాల్లో ప్రి–కోవిడ్‌‌‌‌ లెవెల్స్‌‌‌‌ కంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ వెల్లడించింది.  బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో మాత్రం డెలివరీలు పడిపోతున్నాయని ఫుడ్‌‌‌‌ టెక్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లు అంటున్నాయి. కరోనా ముందుకాలంలో పోలిస్తే సిటీల ఇప్పుడు వస్తున్న ఆర్డర్ల సంఖ్య తక్కువగానే ఉందని జొమాటో పేర్కొంది. చిన్న నగరాల్లోనే బిజినెస్ బాగుందని స్పష్టం చేసింది. ఇది వరకు మెట్రో నగరాల నుంచి తమ యాప్‌‌‌‌ను వాడిన వారిలో చాలా మంది ఇప్పుడు చిన్న సిటీల్లో దానిని ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. చిన్న నగరాలకు వెళ్లిపోయిన వారిలో మూడింత ఒకవంతు మంది అక్కడి నుంచే ఆర్డర్లు ఇస్తున్నారని జొమాటో పేర్కొంది. పట్నా, జంషెడ్‌‌‌‌పూర్‌‌‌‌, రాంచీ, సిలిగురి నుంచి ఆర్డర్లు బాగా వస్తున్నాయని తెలియజేసింది.