పెద్దలు వేపచెట్టు దివ్య వృక్షం అని చెప్తుంటారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వేపాకు అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పని చేస్తుంది. చర్మవ్యాధుల నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని బెరడుతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని బెరడు నుంచి వచ్చే జిగురు పదార్ధాన్ని ఈస్టిండియా గమ్ అంటారు. ఈ జిగురును నేత పరిశ్రమలో ఎక్కువగా వాడుతుంటారు.
రంగులు అద్దకపు పరిశ్రమలో కూడా దీన్ని వాడతారు. కొన్ని రకాల మెడిసిన్ లో కూడా ఈ జిగురు వాడతారు. వేప పండ్ల నుంచి తీసిన తైలాన్ని దోమలను నివారించే రసాయనాల్లో వాడుతుంటారు. వేప పిండిని క్రీమిసంహారిక మందుల్లో కలపి పిచికారీ చేస్తారు. ఇది మొక్కలకు చక్కని ఎరువుగా పనిచే స్తుంది కూడా. వేప ఆకును ఎరువుగా కూడా వాడుతారు. వేప కలప త్వరగా పుచ్చి పోదు. అందుకే దానితో వ్యవసాయ పనిముట్లు చేస్తుం టారు. దీన్ని ఆయుర్వేదంలో కూడా వాడతారు. సబ్బులు, షాంపుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అందుకే ఇంటి పెరట్లో వేప చెట్టుని పెంచాలి అంటుంటారు పెద్దలు.