ఐసీసీ తొలి మహిళా రెఫరీగా తెలుగు బిడ్డ

ఐసీసీ తొలి మహిళా రెఫరీగా తెలుగు బిడ్డ

దుబాయ్‌ : అంతర్జా తీయ క్రికెట్‌‌‌‌ సమాఖ్య (ఐసీసీ)లోమహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఇండియా మాజీ క్రికెటర్‌ , రెఫరీ జీఎస్‌‌‌‌ లక్ష్మికి ఐసీసీ అరుదైన అవకాశం కల్పించిం ది. ఇంటర్నేషనల్​ మ్యాచ్‌ రెఫరీల ప్యానెల్‌ కు ఆమెను ఎంపికచేసింది. దీంతో, ఈ ప్యానెల్‌ కు ఎంపికైన తొలిమహిళా రెఫరీగా 51 ఏళ్ల లక్ష్మి రికార్డు సృష్టించింది.రాజమండ్రిలో పుట్టిన లక్ష్మి.. 1986 నుంచి 2004 వరకు క్రికెటర్‌ గా కొనసాగింది. ఇండియా మహిళల టీమ్‌ తో పాటు ఆంధ్ర, రైల్వేస్‌‌‌‌, బిహార్‌ , ఈస్ట్‌‌‌‌జోన్‌ ,సౌత్‌ కు ప్రాతినిథ్యం వహించింది. అనంతరం2008–09 సీజన్‌ లో దేశవాళీ మహిళల క్రికెట్‌‌‌‌లోతొలిసారి రెఫరీగా వ్యవహరించింది. ఇప్పటిదాకామూడు మహిళల వన్డేలు, మూడు టీ20లను పర్యవేక్షించి న ఆమె ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌ ల్లోరెఫరీగా వ్యవహించేందుకు అర్హత సాధించింది. ‘ఇంటర్నేషనల్‌ ప్యానెల్‌ కు సెలెక్ట్‌‌‌‌ అవడం ఐసీసీ నాకు ఇచ్చిన గౌరవం. దీనివల్ల క్రికెట్‌‌‌‌లో మహిళలకు కొత్తమార్గాలు తెరిచారు. క్రికెటర్‌ గా, మ్యాచ్‌ రెఫరీగానాకున్న సుదీర్ఘ అనుభవం అంతర్జాతీయ స్థాయిలో మంచి అధికారిగా పేరు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ఈ సందర్భం గా ఐసీసీ, బీసీసీఐ అధికారులతో పాటు ఇన్నేళ్లుగా నాకు అండగా నిలిచిన సహచరులు, ఫ్యామిలీ మెంబర్స్‌ కు థ్యాంక్స్‌ . వాళ్ల అంచనాలను అందుకొని, నా కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని భావిస్తున్నా’ని జీస్‌‌‌‌ లక్ష్మి చెప్పుకొచ్చింది. కాగా, ఆస్ట్రేలియాకు చెం దిన ఎలాయిస్‌‌‌‌ షెరిడన్‌ .. ఐసీసీ డెవెలప్‌ మెండ్‌ ప్యానెల్‌ ఆఫ్‌ అంపైర్ల జాబితాలో చేరింది.