GSLV-F10 రాకెట్ ప్రయోగం విఫలం

GSLV-F10 రాకెట్ ప్రయోగం విఫలం


ఇస్రో చేపట్టిన GSLV – F 10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తి ప్రయోగం ఫెయిల్ అయింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి రాకెట్ ను ప్రయోగించారు. తెల్లవారు జామున 5 గంటల 43 నిమిషాలకు GSLV –F 10 నింగిలోకి ఎగిరింది. క్రయోజనిక్ దశలో సాంకేతిక సమస్య తలెత్తిందని.....దాంతో శాటిలైట్ వెళ్లాల్సిన రూట్ లో కాకుండా వేరే రూట్ లో వెళ్లిందన్నారు ఇస్రో ఛైర్మన్ శివన్. 2 వేల 268 కేజీల బరువున్న జీశాట్ -1 ఉపగ్రహాన్ని నిర్ణత క్రమంలో ప్రవేశపెట్టే క్రమంలో సాంకేతిక సమస్య వచ్చింది. 

భూ పరిశీలన కోసం దీన్ని ప్రయోగించారు. నీటివనరులు, పంటలు, అడవులు, హిమానీనదాలు, సరిహద్దుల్లో అంచనా గురించి ఇది నిరంతర సమాచారం అందించాల్సి ఉంది. భవిష్యత్ లో జరగబోయే ప్రకృతి వైపరీత్యాలను ఈ ఉపగ్రహం ద్వారా ముందే పసిగట్టొచ్చు. గతేడాది మార్చిలోనే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నా.... కరోనా ఉద్ధృతి, సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.