బెంగళూరు స్టార్టప్​కు ట్యాక్స్​ నోటీసులు

బెంగళూరు స్టార్టప్​కు ట్యాక్స్​ నోటీసులు

న్యూఢిల్లీ: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.21 వేల కోట్ల పన్ను చెల్లించాలంటూ జీఎస్టీ ఇంటెలిజెన్స్ యూనిట్ బెంగళూరుకు చెందిన ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ గేమింగ్ స్టార్టప్ గేమ్స్​క్రాఫ్ట్ టెక్నాలజీ (జీటీపీఎల్)కి షోకాజ్ నోటీసును జారీ చేసింది. పరోక్ష పన్నుల చరిత్రలో ఇదే అతిపెద్ద నోటీసు అని  తెలిపింది. గేమ్స్​క్రాఫ్ట్ టెక్నాలజీ కార్డ్, క్యాజువల్,  ఫాంటసీ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన రమ్మీ కల్చర్, గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ, రమ్మీ టైమ్ మొదలైన వాటి ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహిస్తోందని తెలిపింది.  గేమ్స్​క్రాఫ్ట్ తన కస్టమర్లకు ఎలాంటి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లనూ జారీ చేయడం లేదని కూడా అధికారులు గుర్తించారు. నేషనల్​ మీడియా రిపోర్టుల ప్రకారం... జీఎస్టీ అధికారులు దాదాపు 77వేల కోట్ల రూపాయల బెట్టింగ్ మొత్తంపై 28 శాతం పన్ను విధించారు.

జీటీపీఎల్ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై డబ్బును వాటాల రూపంలో పందెం వేయడానికి అనుమతిస్తుందని పన్ను అధికారులు పేర్కొన్నారు. విచారణ సమయంలో ఈ గేమింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాం ఇచ్చినవి నకిలీ/బ్యాక్ డేట్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లని ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా తేలింది. వాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబ్బు జమ చేసిన తర్వాత తిరిగి అది వెనక్కి వచ్చే మార్గం లేకపోవడంతో కంపెనీ తన కస్టమర్లతో బలవంతంగా బెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిస్తోంది.  గేమ్స్​క్రాఫ్ట్ టెక్నాలజీస్ బెంగళూరు నగరంలో ఐదు అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను సుమారు రూ. 32 కోట్లకు కొనుగోలు చేసిందని  గత ఏడాది కూడా వార్తలు వచ్చాయి. సేల్​ అగ్రిమెంట్ గత ఆగస్టులో జరిగింది.