జీఎస్టీ వసూళ్లు..రూ. 1.68 లక్షల కోట్లు

జీఎస్టీ వసూళ్లు..రూ. 1.68 లక్షల కోట్లు

న్యూఢిల్లీ:   జీఎస్టీ వసూళ్లు గత నెల12.5 శాతం పెరిగి రూ. 1.68 లక్షల కోట్లకు చేరుకున్నాయని, దేశీయ లావాదేవీల కారణంగా ఇది సాధ్యమయిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.   ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2023-–ఫిబ్రవరి 2024) మొత్తం స్థూల జీఎస్టీ  వసూళ్ల విలువ రూ. 18.40 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన వసూళ్ల కంటే 11.7 శాతం ఎక్కువ. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల వసూళ్లు రూ. 1.67 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కోట్లను అధిగమించింది. "ఫిబ్రవరి 2024లో స్థూల వస్తువులు  సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం రూ. 1,68,337 కోట్లుగా ఉంది. ఇది 2023లో ఇదే నెలతో పోలిస్తే 12.5 శాతం పెరిగింది" అని ఆర్థికమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.