జీఎస్టీ వసూళ్లు @1.68 లక్షల కోట్లు

జీఎస్టీ వసూళ్లు @1.68 లక్షల కోట్లు

న్యూఢిల్లీ :  జీఎస్టీ వసూళ్లు కిందటి నెల 15 శాతం పెరిగి దాదాపు రూ. 1.68 లక్షల కోట్లకు చేరాయి. స్థూల జీఎస్టీ వసూళ్లు 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆరవ సారి రూ.1.6 లక్షల కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది నవంబర్​లో జీఎస్టీ ఆదాయం రూ. 1,67,929 కోట్లు కాగా, ఇందులో సీజీఎస్టీ రూ. 30,420 కోట్లు, ఎస్‌‌జీఎస్టీ రూ. 38,226 కోట్లు, ఐజీఎస్టీ రూ. 87,009 కోట్లు ( వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 39,18,199 కోట్లు కలిపి)  సెస్ రూ. 12,274 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 1,036 కోట్లతో కలిపి) ఉంది.

‘‘ప్రభుత్వం రూ. 37,878 కోట్లను సీజీఎస్టీకి, రూ. 31,557 కోట్లను ఎస్‌‌జీఎస్టీకి ఐజీఎస్టీ నుంచి సెటిల్ చేసింది. కేంద్రం  రాష్ట్రాల మొత్తం ఆదాయం నవంబర్‌‌ నెలలో రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత సీజీఎస్టీకి రూ. 68,297 కోట్లు, ఎస్​జీఎస్టీకి రూ. 69,783 కోట్లు ఉంది” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈసారి దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు (సేవల దిగుమతితో సహా) గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుంచి వచ్చిన ఆదాయాల కంటే 20శాతం ఎక్కువగా ఉన్నాయి.