
న్యూఢిల్లీ: దేశీయ ఆదాయాలు పెరగడంతో గత నెల స్థూల జీఎస్టీ వసూళ్లు 7.5 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది జులైలో గ్రాస్ జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు. గత నెలలో వసూళ్లు రూ.1.84 లక్షల కోట్లగా నమోదయ్యాయి. స్థూల దేశీయ ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.1.43 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతుల నుంచి వచ్చే పన్ను 9.5 శాతం పెరిగి రూ.52,712 కోట్లకు చేరుకుంది.
జీఎస్టీ రీఫండ్‌లు గత ఏడాదితో పోలిస్తే 66.8 శాతం పెరిగి రూ.27,147 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది జులైలో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.69 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 1.7 శాతం పెరిగింది.