ఆన్‌‌‌‌లైన్ గేమింగ్‌‌‌‌పై జీఎస్టీ గురించి మీటింగ్‌

ఆన్‌‌‌‌లైన్ గేమింగ్‌‌‌‌పై  జీఎస్టీ గురించి మీటింగ్‌

హైదరాబాద్​, వెలుగు: ఆన్‌‌‌‌లైన్ గేమింగ్‌‌‌‌పై జీఎస్టీ అమలు తేదీని నిర్ణయించడానికి జీఎస్టీ కౌన్సిల్ వచ్చే నెల 2 న సమావేశమయ్యే అవకాశం ఉంది. 28శాతం జీఎస్టీని డిపాజిట్లపై విధించాలా ? లేదా ప్రతి గేమ్‌‌‌‌పై విధించాలా ? అనే విషయాన్ని కూడా కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ప్రతి గేమ్‌‌‌‌పై 28శాతం పన్ను విధించడం వల్ల.. ఒకే రూపాయికి పదేపదే పన్ను వర్తిస్తుందని రెవెన్యూ కార్యదర్శి ఇటీవల అంగీకరించారు. 

ఫలితంగా పన్ను రేటు 50 శాతం-–70 శాతం వరకు అవుతుందని గేమింగ్​ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాదిరిగా జీజీఆర్​పై పన్ను విధించబోమని అన్నారు.