జీఎస్టీ @  95,480 కోట్లు.. పెరిగిన కలెక్షన్లు

V6 Velugu Posted on Oct 02, 2020

న్యూఢిలీ: జీఎస్టీ కలెక్షన్లు పెరుగుతున్నాయని,  గత నెల వసూళ్ల విలువ రూ. 95,480 కోట్లుగా రికార్డు అయిందని సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ  పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలలోనే జీఎస్టీ కలెక్షన్ ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్తో పోల్చుకుంటే ఈ కలెక్షన్ 10.4 శాతం ఎక్కువ కాగా, గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే 4 శాతం ఎక్కువ.  ఈ మొత్తం కలెక్షన్లో రూ. 17,741 కోట్లు సెంట్రల్ జీఎస్టీ కాగా, స్టేట్ జీఎస్టీ వాటా రూ. 23,131 కోట్లుగా ఉంది. ఐజీఎస్టీ కింద రూ. 47,484 కోట్లు వసూలయ్యాయి. ఐజీఎస్టీ కలెక్షన్లో దిగుమతులపై వేసిన పన్నులు రూ. 22,442 కోట్లు కలిసున్నాయి.   ఐజీఎస్టీ కింద కలెక్ట్ అయిన పన్నుల్లో రూ. 21,260 కోట్లు సీజీఎస్టీగా ఉండగా, రూ. 16,997 కోట్లు ఎస్జీఎస్టీగా ఉన్నాయి.

 

 

Tagged India, state, increased, Collections, GST, finance, records, Central, customes, Ministry, crores, Rs, import, Export, 480 crore, 95%

Latest Videos

Subscribe Now

More News