బట్టలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా

బట్టలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా

చేనేతపై జీఎస్టీ పెంపు నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది. ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో.. రాష్ట్రాలన్నీ.. ట్యాక్స్ శ్లాబు మార్పును వ్యతిరేకించాయి. అటు చేనేత పరిశ్రమ వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఇవాళ్టి భేటీలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫిబ్రవరిలో జరిగే కౌన్సిల్ మీటింగ్ లో దీనిపై మరోసారి చర్చించనున్నారు. ప్రస్తుతం చేనేతపై 5 శాతం జీఎస్టీ ఉంది.. దీన్ని 12 శాతానికి పెంచాలని కొద్ది రోజుల క్రితం నిర్ణయించారు. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి  అమలులోకి రావాల్సి ఉంది.