
న్యూఢిల్లీ: పన్ను ఎగవేసినందుకు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు ఇప్పటి వరకు రూ. లక్షల కోట్ల ట్యాక్స్ నోటీసులు ఇష్యూ చేశామని జీఎస్‌టీ అధికారి ఒకరు పేర్కొన్నారు. డ్రీమ్11 వంటి గేమింగ్ కంపెనీలకు , డెల్టా కార్ప్ వంటి క్యాసినో ఆపరేటర్స్‌కు కిందటి నెల జీఎస్‌టీ షోకాజ్ నోటీసులను అధికారులు ఇష్యూ చేశారు. వీటి కంటే ముందు గేమ్స్‌క్రాఫ్ట్‌కు రూ.21 వేల కోట్ల ట్యాక్స్ నోటీసును కిందటేడాది సెప్టెంబర్‌లో పంపారు.
ఈ ఇష్యూకి సంబంధించి కంపెనీకి కర్నాటక హై కోర్టులో ఊరట లభించింది. కానీ, ప్రభుత్వం ఈ ఏడాది జులైలో స్పెషల్ లీవ్ పిటీషన్‌ను సుప్రీం కోర్టులో వేసింది. అలానే డెల్టా కార్ప్‌కు ఇష్యూ చేసిన నోటీసులపై ఫైనల్ ఆర్డర్‌ను తమ పర్మిషన్ లేకుండా ఇష్యూ చేయొద్దని బాంబే హైకోర్టు గోవా బెంచ్ తాజాగా తీర్చిచ్చిన విషయం తెలిసిందే. ఇండియాలో ఫారిన్ కంపెనీల రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ ఈ నెల 1 తర్వాత రిజిస్టర్ అయిన కంపెనీల డేటా అందుబాటులో లేదని చెప్పారు.
కాగా, దేశంలో సర్వీస్‌లు అందించాలనుకుంటే ఫారిన్ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం జీఎస్‌టీ చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. ఈ నెల ఒకటి నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చింది. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలోని మొత్తం బెట్ వాల్యూపై 28 శాతం జీఎస్‌టీని జీఎస్‌టీ కౌన్సిల్ ఈ ఏడాది ఆగస్టులో విధించిన విషయం తెలిసిందే.