టెట్రా ప్యాక్ పెరుగు, లస్సీపై జులై 18నుంచి 5శాతం జీఎస్టీ

 టెట్రా ప్యాక్ పెరుగు, లస్సీపై జులై 18నుంచి 5శాతం జీఎస్టీ

నిత్యం పెరుగుతున్న గ్యాస్, పెట్రోలు, డిజిల్ తో పాటు నిత్యావసరాల ధరలు సైతం పెరుగుతుండడంతో సామాన్యునికి భారంగా మారింది. దీనికి తోడు కొత్తగా మరికొన్ని వస్తువులపైనా అదనపు పన్ను విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్న కేంద్రం.. వాటిని జులై 18నుంచి అమలుచేయనుంది. అందులో భాగంగా టెట్రా ప్యాక్ పెరుగు, లస్సీపై జులై 18నుంచి 5శాతం జీఎస్టీ విధించబడుతుందని పేర్కొంది. ఇప్పటి వరకూ ఈ వస్తువులపై ఎలాంటి పన్నూ లేదు. కానీ తాజా నిర్ణయంతో వీటిపైనా భారం పడనుంది. వీటితో పాటు హోటళ్లలో రోజుకు రూ.1000 కంటే తక్కువ అద్దె గదులపై 12శాతం, ఆసుపత్రులలో రూ.5000కంటే ఎక్కువ అద్దె గదులపై 5శాతం జీఎస్టీ అప్లై అవనుంది. అట్లాస్ మ్యాప్స్ పై 12%, LED లైట్లు, LED ల్యాంప్ బ్లేడ్‌లు, పేపర్ కత్తెరలు, పెన్సిల్ షార్పనర్‌లు, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్, కేక్-సర్వర్లు మొదలైన వాటిపై 12 నుంచి ఇప్పుడు 18 శాతానికి GST  అమలు కానుంది.