జీఎస్టీ తగ్గింపుతో ఎంతో మేలు.. సౌత్ ఇండియన్ సిమెంట్ తయారీదారుల సంఘం

జీఎస్టీ తగ్గింపుతో ఎంతో మేలు.. సౌత్ ఇండియన్ సిమెంట్ తయారీదారుల సంఘం

న్యూఢిల్లీ: సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) జీఎస్టీ 2.0 విధానాన్ని స్వాగతించింది. సిమెంట్‌‌‌‌‌‌‌‌పై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించడం పరిశ్రమ, పెట్టుబడులకు చాలా ఉపయోగపడుతుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌కు ఎస్‌‌‌‌‌‌‌‌ఐసీఎంఏ కృతజ్ఞతలు తెలిపింది. 

 ‘‘ సిమెంట్‌‌‌‌‌‌‌‌పై పన్ను తగ్గడం వల్ల గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వ్యయం గణనీయంగా తగ్గుతుంది. వ్యక్తిగత, గృహ నిర్మాణదారులకు, తక్కువ ఖర్చుతో కూడిన ఇళ్ల ప్రాజెక్టులకు ఇది లాభదాయకం. డిమాండ్ పెరగడం వల్ల పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఇది కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీస్తుంది. ఈ సంస్కరణ దేశ నిర్మాణంలో సిమెంట్‌‌‌‌‌‌‌‌కు ఉన్న కీలక పాత్రను గుర్తించింది. సిమెంట్​రంగం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది” అని ఎస్‌‌‌‌‌‌‌‌ఐసీఎంఏ పేర్కొంది.