ఫిబ్రవరిలో జీఎస్టీ రాబడి రూ.97 వేల కోట్లు

ఫిబ్రవరిలో జీఎస్టీ రాబడి రూ.97 వేల కోట్లు

న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జీఎస్టీ రాబడి రికార్డు స్థాయిలో నమోదైంది. రూ.97,247 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇందులో సీజీఎస్టీ రూ.17,626 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ.24,192 కోట్లు, ఐజీఎస్టీ రూ.46,953 కోట్లు (దీనిలో దిగుమతుల ద్వారా వచ్చిన సొమ్ము రూ.21,684 కోట్లు), సెస్ ద్వారా రూ.8,476 కోట్ల (ఇంపోర్ట్స్ పై రూ.910 కోట్లు) రెవెన్యూ వచ్చింది.

2018 ఫిబ్రవరిలో జీఎస్టీ రాబడి రూ.85,962 కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది 13.12 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 28 రోజుల సమయంలో రూ.97,247 కోట్ల జీఎస్టీ వచ్చింది.

ఐజీఎస్టీ నుంచి రూ.19,470 కోట్ల మొత్తం సీజీఎస్టీకి, రూ.14,747 కోట్లను ఎస్ జీఎస్టీకి కేంద్రం సెటిల్ చేసింది. ఈ సెటిల్మెంట్ తర్వాత ఫిబ్రవరిలో వచ్చిన సీజీఎస్టీ మొత్తం రూ.37,095 కోట్లకు, ఎస్ జీఎస్టీ రూ.39,939 కోట్లకు చేరింది.