
న్యూఢిల్లీ: కిందటి నెలలో రూ. 1.74 లక్షల కోట్ల జీఎస్‌టీ రెవెన్యూ వచ్చింది. కిందటేడాది జూన్‌లో వచ్చిన రూ.1.61 లక్షల కోట్లతో పోలిస్తే 7.7 శాతం పెరిగింది. 2021 జులై తర్వాత జీఎస్‌టీ వసూళ్లు ఈసారే తక్కువగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్‌టీ రెవెన్యూ 10 శాతం పెరగగా, మే నెలలో 12.4 శాతం పెరిగింది. జూన్ ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీలో సుమారు రూ.39,600 కోట్లు సెంట్రల్ జీఎస్‌టీ కింద సెటిల్ చేయగా, రూ.33,548 కోట్లు స్టేట్ జీఎస్‌టీ కింద సెటిల్ చేశారు. ఈ ఏడాది మే నెలలో రూ.1.73 లక్షల కోట్ల జీఎస్‌టీ రెవెన్యూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డ్ లెవెల్ రూ.2.1 లక్షల కోట్లను టచ్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో రూ.5.57 లక్షల కోట్ల జీఎస్‌టీ రెవెన్యూ వచ్చింది. నెలకు సగటున రూ.1.86 లక్షల కోట్లు వసూళ్లయ్యింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున రూ.1.68 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లయ్యింది.