గద్వాలపై  టూరిజం శీతకన్ను

గద్వాలపై  టూరిజం శీతకన్ను

చెరువుల్లో బోట్లు తిప్పుతామంటారు.. జూరాల ప్రాజెక్టు జలాశయంలో దాదాపు 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఎప్పటికీ నీటి నిల్వ ఉండే అవకాశం ఉన్నా టూరిజం ఆఫీసర్ల పరిశీలనకు రావడం లేదు.మహబూబ్ నగర్‌ , గద్వాల పట్టణాల సమీపంలో చెరువుల్లో బోట్లను విహరింపజేసిన టూరిజం ఆఫీసర్లు ఏటా వేల సంఖ్యలో సందర్శించే జూరాలలో బోటిం గ్‌ ప్రతిపాదనకు మోక్షం కల్పించడం లేదు. ఉమ్మడి పాలకుల కాలంలో పాలమూరు జిల్లాలో ఉన్న వనరులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంలో పట్టిం చుకోలేదనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ వచ్చింది . ఐదేళ్లు గడచిపోయాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యాటక పరంగా కొత్తగా ఏ పథకాన్నీ చేపట్టలేక పోయారు.నేషనల్ హైవే పక్కన బీచుపల్లి పుణ్యక్షేత్రం సమీపంలో నిజాంకొండ వద్ద నదిలో నీటినిల్వలో బోటిం గ్‌ ఏర్పాటు చేసేందుకు ఏ ప్రయత్నమూ జరగలేదంటే టూరిజం ఆఫీసర్ల తీరు ఎలా ఉందో తెల్సిపోతోంది . అదే విధంగా నిజాంకొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కూడా అడుగుపడలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే దక్షిణ కాశీగా పిలుచుకునే ఏకైక ఆలయాల సముదాయం, ఐదో శక్తి పీఠం ఉన్న అలంపూర్‌ వద్ద పర్యాటకంగా చేపట్టాల్ సిన అభివృద్ధికి కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయలేకపోయారు. బీచుపల్లి, చింతరేవుల, మల్ధకల్ పుణ్యక్షేత్రాల వద్ద పర్యాటకుల కోసం భవనాలు నిర్మించారు.

జూరాల వద్ద గతంలో ప్రతిపాదన..

రెండేళ్ల క్రితం టూరిజం ఆఫీసర్లు జూరాల రిజర్వాయర్ ​వద్ద పర్యాటక భవన సముదాయం, వాణిజ్య సముదాయం నిర్మాణం చేసి, బోటిం గ్‌ ఏర్పాటు పై పరిశీలించి వెళ్లారు. నాటి నుంచి మళ్లీ జూరాల వైపునకు రాలేదు. జూరాల జలాశయంలో పూర్తి స్థాయి నీటినిల్వ 9.66 టీఎంసీలు కాగా, ప్రధాన కాలువ ద్వారా దిగువకు వెళ్లకుం డా డెడ్‌ స్టోరేజీలో 2.01 టీఎంసీల నీరు వేసవిలోనూ నిల్వ ఉంటుంది . జూరాల జలాశయం నుంచి కర్ణా టక రాష్ట్రంలో కృష్ణా నది మధ్యలో ఉన్న నారదగడ్డ పుణ్యక్షేత్రం వరకు బోట్లలో వెళ్లి రావడానికి అవకాశం ఉంది. పోను, రాను దాదాపు 15కిలోమీటర్ల ప్రయాణం. అదే విధంగా జూరాల ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే వారికి జూరాల వాణిజ్య ముదాయంలో సకల సౌకర్యాలను కల్పించడంతో పాటు, గద్వాల చీరల దుకాణాలను అక్కడ ఉండేలా చూడాలనే ఆలోచన నేటికీ నెరవేరడం లేదు. గత జూన్‌ 29న గట్టు ఎత్తిపోతల పథకంకు శంకుస్థా పన చేయడానికి గద్వాలకు వచ్చి న సీఎం కేసీఆర్‌ జూరాల ప్రాజెక్టు వద్ద రూ.15 కోట్ల అంచనాతో పార్కు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఇంజినీర్లు నేటికీ కనీసం ప్రాథమిక అంచనా కూడా రూపొందించలేదు. చివరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి ప్రైవేటు ఏజెన్సీతో పార్కు ప్లానింగ్‌ ను రూపొందించేందుకు ఆఫీసర్లకు సూచించారు. ఇప్పటికైన ఉన్న వనరులతో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.