గుడుంబా శంకర్ రీ-రిలీజ్ ట్రైలర్ ఇవాళే..గెట్ రెడీ బ్రోస్

గుడుంబా శంకర్ రీ-రిలీజ్ ట్రైలర్ ఇవాళే..గెట్ రెడీ బ్రోస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా..డైరెక్టర్ వీర శంకర్ తెరకెక్కించిన మూవీ గుడుంబా శంకర్(Gudumba Shankar). పవన్ కళ్యాణ్ కి జోడీగా మీరా జాస్మిన్ నటించింది. పవన్ కెరీర్లోనే ఓ స్వాగ్ క్రీయేట్ చేసింది ఈ మూవీ. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, స్టైల్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ మూవీని రీ రిలీజ్(Rerelease) చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.  

ఇవాళ(ఆగస్టు19న) సాయంత్రం 5 గంటలకి గుడుంబా శంకర్ రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. కాగా ఈ మూవీని ఆగస్టు 31న 4K వెర్షన్ లో రీ రిలీజ్ చేయడానికి భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలు కన్ఫర్మ్ అంటున్నారు మేకర్స్. 2004లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌ గా నిలిచిన..మెలోడీ బ్రహ్మ మణిశర్మ(ManiSharma) అందించిన మ్యూజిక్ కు ఫ్యాన్స్ మెస్మరైజ్ అయ్యారు. ఇక యూత్ ట్రెండ్ సెట్ చేయడంలో చాలా డెవలప్ అవ్వడంతో..గుడుంబా శంకర్ రీ రిలీజ్ పై హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. 

ఈ మూవీని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు(NagaBabu) ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాకు పవన్ స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా మూడు పాటలకు యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు. 'గుడుంబా శంకర్' అనే టైటిల్ చూసి పవన్ ఇమేజ్ కి తగ్గట్టు ఇదొక మాస్ మసాలా సినిమా అని ఊహించుకున్న ప్రేక్షకులు.. కామెడీ ఎంటర్టైనర్ అవడంతో డిజప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు.