- అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
అహ్మదాబాద్: నలుగురు ఐసిస్ టెర్రరిస్టులను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ఏజెన్సీల నుంచి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా గుజరాత్ ఏటీఎస్ ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది.
ఈ క్రమంలో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నలుగురు ఉగ్రవాదులు శ్రీలంక నుంచి చెన్నైకి.. అక్కడ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
